పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1 లక్ష జీతంతో బెస్ట్ నోటిఫికేషన్ … 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ .. అరుదైన అవకాశం ..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్… న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు . అందరి అభ్యర్థులకు ఇది ఒక చక్కని సదవకాశం . వెంటనే అప్లై చేసి పరీక్షకి సన్నద్ధం అవ్వండి .
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54 పోస్టులు
2. మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు
3. మేనేజర్ ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 02 పోస్టులు
4. మేనేజర్-ఐటీ (ఎంటర్ప్రైజ్ డేటా వేర్హెన్): 01 పోస్టు
5. సీనియర్ మేనేజర్- ఐటీ (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు
6. సీనియర్ మేనేజర్- ఐటీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ & క్లౌడ్): 01 పోస్టు
7. సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఎస్ఎల్ఎ, పేమెంట్స్): 01 పోస్టు
8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్టు: 07 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 68.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) లేదా బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్). లేదా బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి అసిస్టెంట్ మేనేజరు 20-30 ఏళ్లు, మేనేజరు 23-35 ఏళ్లు, సీనియర్ మేనేజరు 26-35 ఏళ్లు. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టు 50 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.2,25,997, మేనేజర్కు రూ.1,77,146. సీనియర్ మేనేజరు రూ.1,40,398 చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.12.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2025.
• ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్- రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
IPPB స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు కింద PDF లో కలవు .
PDF లింక్ :https://www.ippbonline.com/documents/20133/133019/1734713243450.pdf
IPPB Specialists: Best notification with with good salary …. Notification …